ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. వరుసగా ప్రతిరోజు పదివేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,080 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడచిన 24 గంటల్లో కరోనాతో 97 మంది మృతి చెందారు. దీనితో మొత్తం ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 1,939 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాలో1,353, తూర్పుగోదావరిలో1,310, అనంతపురంలో976, చిత్తూరు జిల్లాలో963, నెల్లూరులో878, విశాఖపట్నం998, గుంటూరు601, కడప525, పశ్చిమ గోదావరిలో681, విజయనగరంలో450, శ్రీకాకుళంలో442, కృష్ణాలో391, ప్రకాశంలో512 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,24,393 మందికి కరోనా టెస్టులు చేయగా 2,14,145 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 1,26,720 మంది డిశ్చార్జ్ కాగా 1,939 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 85,486 చికిత్స పొందుతున్నారు.