ఆ వూళ్ళో అన్నీ 101లే.. గుడి, బావి, చెరువు ఇలా ఏది చూసినా 101 ఉంటాయ్. ఆ నెంబర్ వీళ్లకు అచ్చొచ్చిందని అనుకుంటున్నారా..? మేటరేంటో మీరే చూడండి..
ఇది తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బిచ్కుంద విలేజ. ఈ గ్రామం ఇప్పటిది కాదు, పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. ఈ గ్రామంలో కాకతీయుల కాలంలో 101 ఆలయాలు నిర్మించినట్టు శాసనాలున్నాయి.
ఇక్కడ ముచికుంద మహర్షి తపస్సు చేశాడని, ఆయన పేరుమీదే బిచ్కుంద ఏర్పాటు అయిందని కథనం. ఆ మహర్షి ఆజ్ఞ మేరకే 101 ఆలయాలు నిర్మించారట.
ఇక ఈ గ్రామంలో 1950లో మక్కల కరువు తీవ్రంగా వచ్చిందట. తినటానికి తిండి, తాగడానికి నీరు దొరక ఏం చేయాలో పాలు పోక ఊరంతా కుంటలు తవ్వుకున్నారు. అవే క్రమంగా బావులుగా మారిపోయాయి. నీటి కరువు రాకూడదనే ఉద్దేశంతో 101 చెరువులు తవ్వుకొని వరి సాగు చేస్తున్నారు. ఇటు ఆలయాలు, చెరువులు, జల వనరులతో బిచ్కుంద గ్రామం ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఈ గ్రామంలో పచ్చదనంతోపాటు దేశభక్తి మెండు. అందుకే 1948లో భరతమాత మందిరాన్ని నిర్మించడమే కాకుండా రోజు పూజలు చేస్తున్నారు. ఇది 101 విలేజ్ స్పెషాలిటీ.