ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండటంతో.. పరీక్షల నిర్వహణకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటినుంచే కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం దాదాపుగా ఓ నిర్ణయానకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మే 17 నుంచి పది పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెబుతున్నారు.మరోవైపు గతంలో ఆరు సబ్జెక్టులకుగాను 11 పేపర్లు ఉండేవి. ఈసారి కేవలం ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నాపత్రాలు తయారు చేయనున్నారు. మొత్తంగా మే 26వ వరకు పరీక్షల నిర్వహణ పూర్తి చేసి.. జూన్ 13వ తేదీ వరకు సమ్మర్ హాలీడేస్ ప్రకటిస్తారని తెలుస్తోంది.