ఫిబ్రవరి1 నుండి తెలంగాణలో పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. 9వ తరగతి నుండి ఆ పై చదువులకు ఇవి వర్తించనున్నాయి. ఇక 26.05.21 వరకు ఈ ఏడాది పాఠశాలలు కొనసాగనుండగా….. 13.06.2021 నుండి వచ్చే విద్యా సంవత్సరం మొదలు కానుంది.
ఇక పదో తరగతి పరీక్షలు 17.05.2021 నుండి 26.05.2021 వరకు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం కు పాఠశాల హాజరుకు మినహాయింపు ఇచ్చారు.
పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పూర్తి షెడ్యూల్ ఇదే