విశాఖను వరుసగా ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లో క్రేన్ విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. మొదట ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతిచెందగా మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నుండి అందుతున్న సమాచారం మేరకు షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో 11మంది మృతుల చెందినట్టు తెలుస్తుంది.
మృతుల్లో నలుగురు షిప్ యార్డ్ ఉద్యోగులు, ఏడుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. షిప్ యార్డ్ యాజమాన్యం నుంచి ఒక కమిటీని , జిల్లా అధికార యంత్రాంగం తరపున ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందిస్తామని కలెక్టర్ అన్నారు.