తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితుడు సైఫ్ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టగా.. ప్రత్యేక బృందం ఇంకా లోతుగా విచారిస్తోంది. సైఫ్ చెప్పిన సమాచారాన్ని బట్టి సాంకేతికంగా ఏం చేయొచ్చు..? ఎలా ముందుకెళ్లొచ్చు..? అని పోలీసులు ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలో ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. మరోవైపు.. ప్రీతి విషయంలో అసలేం జరిగింది..? ప్రీతి ఇంజక్షన్ తీసుకున్నప్పటి నుంచి నిమ్స్ తరలించే వరకూ ఏమేం జరిగింది..? అనే విషయాలపై లంబాడీల ఐక్య వేదిక 11 ప్రశ్నలు లేవనెత్తుతోంది. పలు డిమాండ్స్‌ను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రీతి అనుమానాస్పద మృతిపై బహుజన నాయకుల హైదరాబాద్ డిక్లరేషన్ రిలీజ్ చేసింది.
1.విధుల నిర్వహణలో ఉన్న ప్రీతి బాయి అపస్మారక స్థితిలో ఉండగా మొదట చూసిందెవరు..?
2. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిబాయి చేయి ఎందుకు కమిలి పోయింది..?
3. ప్రీతి బాయి అపస్మార స్థితిలో ఉన్న సమయం నుండి ప్రీతి తండ్రికి ఫోన్ వచ్చే వరకు మధ్యల ఏం జరిగింది..? ప్రీతి అపస్మారక స్థితిలో ఉండగానే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు..?
4. ఫింగర్ ప్రింట్ లాక్‌లో ఉన్న ప్రీతి మొబైల్ డాటాను , అలాగే వారి బ్యాచ్‌మెట్‌లతో చేసిన చాట్‌ను డిలీట్ చేసిందెవరు..?
5. ప్రీతి మొబైల్‌లో హిస్టరీ చూడాల్సిన అవసరం ఏం వచ్చింది..? హిస్టరీలో డ్రగ్ గురించి సెర్చ్ చేశారని ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి దాని మీదనే కేసును తప్పుదోవ ఎందుకు పట్టించారు..?
6. ప్రీతి తండ్రి రాక ముందే అన్ని డిపార్ట్‌మెంట్‌ల హెడ్‌లు అక్కడికి ఎందుకొచ్చారు..?
7. వరంగల్‌కు ప్రీతికి చేసిన చికిత్స ఏమిటి..?
8. మంచి చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొని వచ్చిన వారు నిమ్స్‌లో ఎలాంటి చికిత్స చేశారు..?
9. సైఫ్‌తో పాటు ఈ కేసులో భాగస్వాములు అయిన వారి పేర్లు ఎందుకు చేర్చలేదు..?
10. డిపార్ట్‌మెంట్ హెడ్.. ప్రీతి బాయిని నాకు చెప్పకుండా దగ్గరికి పోతారా అని ఎందుకు బెదిరించారు..?
11. పోలీసు వ్యవస్థ ఈ కంప్లయింట్ రాగానే ఎందుకు నిర్లక్ష్యం వహించింది..? అని ప్రకటనలో లంబాడీల ఐక్య వేదిక ప్రశ్నించింది.
ఈ సందేహలన్నింటిని వెంటనే నివృత్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.