2020లో 11శాతం పెరిగిన నేరాలు
దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా 2020లో సైబర్ నేరాల సంఖ్య 11శాతం పెరిగినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్ సీఆర్ బీ) తెలిపింది. ఈ మేరకు క్రైమ్ ఇన్ ఇండియా- 2019 పేరిట నివేదికను విడుదల చేసంది. ఆ వివరాల ప్రకారం…
2017లో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 21,796 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఈ సంఖ్య 2018లో 27,248 కేసులుగా ఉన్న నివేదిక ప్రకారం తెలుస్తోంది. 2019లో 44,735, 2020లో 50035 కేసులు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది.
క్రైమ్ ఇన్ ఇండియా-2020 ప్రకారం చూస్తే 2020లో దేశంలో 50035 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇది 2019లో 44735 కేసులతో పోలిస్తే 11.8శాతం పెరిగినట్టు నివేదిక తెలిపింది. ఇక సైబర్ క్రైమ్ రేటు 2019లో 3.3శాతం ఉండగా 2020లో 3.7శాతానికి పెరిగింది.
2020లో నమోదైన సైబర్ కేసుల్లో 60.2శాతం మోసం, 6.6 శాతం లైంగిక దోపిడి, 4.9శాతం దోపిడి కారణాలుగా ఉన్నాయి. సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిన నేపథ్యంలో తగిన చర్యల తీసుకోనెల రాష్ట్రాలకు సూచించాలని కేంద్ర హోం శాఖకు హోం కమిటీ సూచించింది.