కథువా కన్నా దారుణం..వారం పాటు హింసించి..

కథువా, ఉన్నావ్ గ్యాంగ్ రేప్ ఘటనలు మరువకముందే గుజరాత్ లో జరిగిన మరో ఘోరం వెలుగులోకి  వచ్చింది. కథువా లో ఎనిమిదేళ్ళ బాలిక  అసిఫాపై  హత్యాచారందేశాన్ని కుదిపివేయగా, గుజరాత్ లో 11 ఏళ్ళ బాలికపై  జరిగిన దారుణం మరింత సంచలనం రేపుతోంది. సూరత్ భెస్టన్ లోని క్రికెట్ మైదానంలో ఈ నెల 6 న ఈ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మైనర్ బాలికపై వారం రోజులపాటు లైంగిక దాడి జరిపి.. చిత్రహింసలు పెట్టి చివరకు గొంతు నులిమి హత్య చేశారు.

ఆమె శరీరంపై 86 గాయాలు ఉన్నాయని 5 గంటలపాటు పోస్ట్ మార్టం నిర్వహించిన సూరత్ సివిల్ ఆసుపత్రీ డాక్టర్లు తెలిపారు. చెక్కతో చేసిన ఆయుధంతో ఆ బాలిక మర్మాంగాలను కూడా మృగాళ్ళు గాయపరిచారని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. కథువా, ఉన్నావ్ ఘటనలలో నిందితులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన మరుసటిరోజే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ దారుణం బయటికొచ్చింది. మృతురాలి వివరాలు తెలియలేదని, వాటిని వెల్లడించినవారికి  20 వేలు రివవార్డు  ఇస్తామని పోలీసులు అంటున్నారు.