దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. కాగా తాజాగా ఏపీలో చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,357 మందికి టెస్ట్ లు చేయగా 11,573 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఎక్కువగా కడప జిల్లాలో 1,942, కర్నూలు లో 1,522, గుంటూరులో 1,298 కేసులు, విశాఖ 1,024 కేసులు నమోదయ్యాయి.అలాగే మరోవైపు గడిచిన 24గంటల్లో 9,445 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
అదే సమయంలో ముగ్గురు మృతి చెందారు.
ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం :
పాజిటివ్ కేసుల సంఖ్య – 22,60,181
డిశ్చార్జ్ కేసుల సంఖ్య – 21,30,162
యాక్టివ్ కేసుల సంఖ్య – 1,15,425
మొత్తం మరణాల సంఖ్య 14,594