అల్లు అర్జున్ తన వివాహ వార్షికోత్సవాన్ని తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హాలతో జరుపుకున్నారు. ఇది అల్లు అర్జున్, స్నేహల 11వ వివాహ వార్షికోత్సవం.
అల్లు అర్జున్ 2011లో స్నేహా రెడ్డిని వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి కూడా ఈ ఇద్దరూ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ఒక స్నేహితురాలి ద్వారా కలిశాడు అల్లు అర్జున్.
ఆమె వివాహానికి హాజరు కావడానికి యూఎస్ఏ వెళ్లాడు. అక్కడకు పెళ్లికి వచ్చిన స్నేహారెడ్డికి పరిచయం అయ్యాడు. స్నేహతో ప్రేమలో పడిన అల్లు అర్జున్ వెంటనే ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
మొదట అల్లుఅర్జున్ ను స్నేహారెడ్డి తండ్రి కె.సి.శేఖర్ రెడ్డి, తల్లి కవితా రెడ్డి అంగీకరించలేదు. కానీ ఆ తరువాత ఒప్పుకున్నారు.