గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు ఈ రోజు డిశ్చార్జ్ కాబోతున్నారు. మరో 10మందికి ఇప్పటికే నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే వారికి మరోసారి పరీక్ష చేసిన తర్వాత నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 77 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక మరోవైపు ఢిల్లీ నిజాముద్దీన్ లో ప్రార్థనలకు వెళ్లిన వారిని ట్రేస్ చేస్తూ… కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది.