మహేష్ కో–ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ పై సైబర్ కేటుగాళ్లు ఎటాక్ చేశారు. దీనితో రంగం లోకి దిగిన సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాలోని 12.4 కోట్ల సొమ్ము ఇతర ఖాతాల్లోకి మల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే అనుమానిత సైబర్ నేరగాళ్లును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
సూపర్ అడ్మిన్‌యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చోరీ చేసి లాగిన్ అయ్యి, బ్యాంకు చెస్ట్ ఖాతాలోని 12.4 కోట్లను మూడు ఖాతాల్లోకి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు స్థానికుల సహకారంతో సైబర్ చిటర్స్ సిటీలోని సిద్ధి అంబర్‌బజార్, అత్తాపూర్‌ల్లో ఉన్న మహేష్ బ్యాంకుల్లో మూడు కరెంట్ ఖాతాలు తెరిచినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
ఈ హ్యాకింగ్ కేసులో నైజీరియన్ల పాత్ర కూడా ఉన్నట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రై మ్ పోలీసులు అదుపులో స్థానికంగా ఖాతాలు తెరిచిన వ్యక్తులు ఉన్నారు.స్థానికులను విచారిస్తూ అసలు ప్రధాన సూత్రధారులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే నగదు చేరిన ఖాతాల్లో కొన్నింటిని ఫ్రీజ్ చేయించారు పోలీసులు.
ఫ్రీజ్ చేసిన ఖాతాలో 2 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. బషీర్‌బాగ్ లో ప్రధాన కార్యాలయం ఉన్న మహేష్ బ్యాంకుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. అయితే బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండా ఆపరేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ తెరిచిన మూడు కరెంట్ ఖాతాల్లోకి బ్యాంకు చెస్ట్ ఖాతా నుండి 12.4 కోట్లు మళ్లించారు. శని, ఆదివారాల్లో బ్యాంకు హాలిడే కావడంతో సర్వర్ పై సైబర్ నేరగాళ్ల ఎటాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మూడు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును నార్త్ తో పాటు త్రిపుర, అసోం, సిక్కింల్లోని వివిధ బ్యాంకుల్లో తెరిచిన 127 ఖాతాల్లోకి నగదు మళ్లించుకుని చాలా వరకు డ్రా చేసేశారు సైబర్ నేరగాళ్లు.