దేశంలోని అత్యున్నత వైద్య విజ్ణాన సంస్థ ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ )మోసగాళ్ల వలకు చిక్కింది. మోసగాళ్లు ఎయిమ్స్ అకౌంట్లలోని రూ.12 కోట్లను డ్రా చేశారు. క్లోన్డ్ చెక్స్‌తో డబ్బులు డ్రా చేసినట్టు తెలిసింది. ఢిల్లీలోని ఎయిమ్స్ హోం బ్రాంచ్ కాకుండా డెహ్రాడూన్, ముంబై ఎస్.బి.ఐ బ్రాంచ్ ల నుంచి డబ్బులు డ్రా చేసినట్టు గుర్తించారు. మొత్తం రూ. 29 కోట్లు డ్రా చేసేందుకు మోసగాళ్లు ప్రయత్నించినట్టు ఆలస్యంగా తెలిసింది. డబ్బులు డ్రా చేసిన చెక్కులను యు.వి.రేస్ ఆధారంగా పరీక్ష చేయగా అవి క్టోన్డ్ చెక్స్ అని తేలింది. అవే నెంబర్లు గల చెక్కులు ఎయిమ్స్ సిబ్బంది దగ్గరే ఉన్నాయి. దీనిపై హాస్పిటల్ సిబ్బంది ఢిల్లీ పోలీసుల ఫిర్యాదు చేశారు.