అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. దక్షిణ కరోలినాలోని ఓ షాపింగ్ మాల్ లో దుండగులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు.
దీనిపై కొలంబియా పోలీస్ చీఫ్ విలియం హాల్ బ్రూక్ మాట్లాడుతూ… కొలింబియా సెంట్రల్ మాల్ లో శనివారం కాల్పులు జరిగాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అయితే తుపాకులతో ఎంత మంది కాల్పులు జరిపారన్న విషయంపై స్పష్టత లేదన్నారు. ఈ ఘటన యాధృచ్చికంగా జరిగినది కాదని, ఇదంతా పథకం ప్రకారం జరిగిందని పేర్కొన్నారు.
ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. ముగ్గురు నిందితులకు ఒకరితో మరొకరి పరిచయం ఉందన్నారు. అయితే వారి మధ్య ఏదో ఘర్షణ తలెత్తి ఉంటుందన్నారు. ఆ తర్వాత అది కాల్పులకు దారి తీసి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.