కరోనా మరోసారి విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మాస్క్ నిబంధనను కొన్ని రాష్ట్రాలు పునరుద్ధరించాయి.
తాజాగా ఐఐటీ మద్రాస్ లో కరోనా కలకలం రేపింది. క్యాంపస్ లోని 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
12 మందికి కరోనా నేపథ్యంలో క్యాంపస్ లోని మిగతా విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
తమిళనాడులో నిన్న 31 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్ లు తప్పనిసరిగా ధరిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు.