చాలా మంది హీరోలు చాలా పాత్రలు చేస్తూ ఉంటారు. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి పాత్రలను చాలానే చేశారు రానా దగ్గుబాటి.
రానా దగ్గుబాటి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సినిమాల్లో తన మొదటి మరియు చివరి పాత్రల గురించి ప్రస్తావించాడు.
కొత్త పుంతలు తొక్కుతూ కొత్త కథలు, పాత్రలు మీ ముందుకు తెస్తానని చెప్పుకొచ్చాడు. అద్భుతమైన 12 సంవత్సరాలు! అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు!! అర్జున్ ప్రసాద్ నుండి డేనియల్ శేఖర్ వరకూ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు.
ఇక రానా నటించిన సినిమాల విషయానికి వస్తే లీడర్, డిపార్ట్‌మెంట్, కృష్ణం వందే జగద్గురుమ్, బాహుబలి, రుద్రమదేవి, ది ఘాజీ ఎటాక్, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు చేశాడు రానా. ప్రస్తుతం రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది.