చైనాలో ఇటీవల రీసెర్చర్లు కనుగొన్నఅతి ప్రాచీన శిలాజం రాక్షసి బల్లులకు, పక్షులకు మధ్య పరిణామక్రమాన్ని సూచిస్తోంది. విచిత్రంగా ఉన్న ఈ శిలాజం డైనోసార్ తలను, శరీరం పక్షి శరీరాన్ని పోలి ఉందని తమ పరిశోధనల్లో వారు కనుగొన్నారు. పక్షులుగా డైనోసార్లు రూపాంతరం చెందాయా అన్న విషయమై మరిన్ని పరిశోధనలు చేయడానికి ఈ శిలాజం ఊతమిస్తోంది, ఇదే సమయంలో డైనోసార్ల నుంచి పక్షులు రూపాంతరం చెందాయా అన్నది కూడా మిస్టరీగానే ఉంది.
రాక్షసి బల్లుల నుంచే పక్షులు రూపాంతరం చెందాయని సాధారణంగా ఏకాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ కి చెందిన పేలియోఆంటాలజిస్టుల రీసెర్చ్ ప్రకారం.. ఈ నాటకీయ పరిణామక్రమం ఇంకా సందేహాలకు తావిస్తూనే ఉంది. 120 మిలియన్ సంవత్సరాలనాటి శిలాజాన్ని వీరు కనుగొన్నప్పుడు ఆశ్చర్యపోతూనే .. దీనికి హై రిసోల్యుషన్ సీటీ స్కానింగ్ నిర్వహించారు. అనంతరం దీని ఎముకలను డిజిటల్ గా తొలగించి అసలైన (ఒరిజినల్) ఆకారం లోకి వచ్చేలా చూశారు.
చివరకు ఈ శిలాజం పుర్రె పక్షి పుర్రెలా ఉండే బదులు టీ.రెక్స్ టైప్ డైనోసార్ పుర్రె మాదిరి ఉందట.. తాము కనుగొన్న విశేషాలను, తమ పరిశోధనల తాలూకు అధ్యయనాన్ని వీరు ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ అనే పత్రికలో ప్రచురించారు. కోట్లాది సంవత్సరాల క్రితమే రాక్షసిబల్లులు అంతరించి[పోయినా.. భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయల్పడుతూనే ఉన్న విషయాన్నీ వీరు గుర్తు చేశారు. ముఖ్యంగా టిటనోసారస్ డైనోసార్లకు, పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. రాక్షసి బల్లికి, పక్షికి మధ్య హైబ్రిడ్ వంటి శిలాజాన్ని కనుగొనడంతో దీనిపై రీసెర్చర్లు మరిన్ని పరిశోధనలకు నడుం బిగించారు.
వాంగ్ మిన్ అనే పరిశోధకుడి కథనం ప్రకారం.. డైనోసార్ భుజంపైని ఎముక .. తన రెక్కవంటి భాగాన్ని రొటేట్ చేయడానికి అనువుగా ఉందట. అంటే రెక్క భాగంలోని ఎముకలను కూడా ఆయన స్టడీ చేశాడు. ఈ పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.