ఏకంగా 120 క్షిపణులతో ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి చేసింది. దీంతో ఉక్రెయిన్ దేశ వ్యాప్తంగా రష్యా వైమానిక దాడుల హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలోని ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజలను, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా పెట్టుకుందని రష్యా దాడులకు పాల్పడుతోందని అధ్యక్ష సలహాదారు మైఖేల్ పొడోయాక్ అన్నారు.
ఈ దాడిలో ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతుందోని మైఖేల్ పొడోయాక్ తెలిపారు. క్షిపణులు కీవ్ లో ల్యాండ్ అయ్యాయని ఆ నగర మేయర్ విటాలీ క్లిచ్కోవ్ పేర్కొన్నారు.
ఖార్కివ్, ఒడిశా, ఎల్వివ్, జైటోమిర్ నగరాల్లో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయన్నారు. ఉక్రెయిన్ పై భారీ ఎత్తున క్షిపణి దాడి జరిగిందని ఒడిశా ప్రావిన్స్ నాయకుడు మాగ్జిమ్ మార్చెంకో తెలిపారు. ఉక్రెయిన్ కూడా కమికేజ్ డ్రోన్ లను ఉపయోగించినట్లు చెప్పారు.
క్లీవ్ నగరంలో సుమార్ 16 క్షిపణులను తిప్పికొట్టారు. కానీ క్షిపణుల తాకిడికి శిథిలాలు ఇళ్లపై పడ్డాయి. మైకోలైవ్ ప్రాంతంలో ఐదు క్షిపణులను అడ్డుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఒడిశా ప్రాంతంలో 21 క్షిపణులను కూల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్వివ్ నగరంలో పలుమార్లు భారీ పేలుళ్లు వినిపించాయని మేయర్ పేర్కొన్నారు.