ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,643 మందికి కరోనా పరీక్షలు చేయగా 121 మందికి పాసిటివ్ నిర్ధారణ
అయింది. ఇక చిత్తూరు లో 32, కృష్ణా లో 20, విశాఖ లో 13, పశ్చిమ గోదావరి లో 13 కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు గడిచిన 24
గంటల్లో 228 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. అలాగే ఒకరు కరోనా కారణంగా మృతి చెందారు.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 20,75,804
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య – 20,59,728
యాక్టివ్ కేసుల సంఖ్య – 1,597
మృతుల సంఖ్య -14,479