
అధికారుల వివరాల ప్రకారం… సెప్టెంబర్ 28-29 డీఆర్‌ఐ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు శిలిగుడి- గువాహటి ప్రాంతంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆ మార్గంలో నలుగురు వ్యక్తులు రెండు వాహనాల్లో వెళ్తు అధికారుల కంటపడ్డారు.
అనుమానంతో వారి వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. వాహనం లోపలి భాగంలో 23.23 కిలోల బంగారాన్ని 21 భాగాలు చేసి దాచినట్లు అధికారులు గుర్తించారు. వాహనం వెనుక భాగంలో ఉన్న రెండు వీల్స్ ను కలిపే క్రాస్-మెంబర్ మెటల్ పైపు లోపల స్మగ్లర్లు బంగారాన్ని దాచారు.
ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో ఈశాన్య కారిడార్‌లో మొత్తం 121 కేజీల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 11 కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
పంజాబ్లోని అమృత్సర్ సరిహద్దులో నాలుగు హెరాయిన్ ప్యాకెట్లను సరిహద్దు భద్రతా దళానికి చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 9 మి.మీ 50 లైవ్ క్యాట్రిడ్జ్లను కూడా బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.