అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. కానీ ఒకటి రెండు మినహా సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇక ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జంటగా లావణ్య త్రిపాటి నటిస్తుంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.
హాకీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రం కాగా ఇందులో లావణ్య హాకీ క్రీడాకారిణి గా కనిపించనుంది. ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.