ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు.. వైరస్ మరణాలు కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 12,561మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,48,608కి చేరింది.
అటు.. వైరస్ తో12 మంది కోవిడ్ తో చనిపోయారు. ఇప్పటివరకు 14,591కు బలైయ్యారు. గడిచిన 24 గంటల్లో 8,742 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 21,20,717మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఒక లక్ష 13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు లో ఎక్కువగా 1,710మంది ఈ వైరస్ బారిన పడ్డారు. గుంటూరు జిల్లాలో 1,625.. కడప జిల్లాలో 1,215.. విశాఖ జిల్లాలో 1,211.. తూర్పుగోదావరి జిల్లాలో 1,067 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ రోజు ఎక్కువ కరోనా మరణాలు విశాఖలో వెలుగుచూశాయి. విశాఖపట్నంలో ముగ్గురు చనిపోగా.. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో ప్రాణాలు వదిలారు. ట్రేసింగ్ పద్దతిలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,23,65,775 కరోనా టెస్టులు చేశారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.