భారత్‌పై కరోనా వైరస్ సునామీలా విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజూ వరల్డ్ రికార్డ్‌లను బ్రేక్ చేస్తూ లక్షకుపైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,26,789 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అంటే గంటకు సరాసరిన 5283 మందికి కరోనా సోకింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో కేసులు ఏదేశంలోనూ విజృంభించింది లేదు.
అటు కరోనా కారణంగా తాజాగా మరో 685 మంది ప్రాణాలు కోల్పోయారు. నమోదవుతున్న కేసులకు, రికవరీలకు సంబంధమే లేకుండాపోయింది. నిన్న మరో 59,258 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులు: 1,29,28,574
కోలుకున్నవారు: 1,18,51,393
యాక్టివ్ కేసులు: 9,10,319
మొత్తం మరణాలు: 16,68,62
దేశవ్యాప్తంగా నిన్న 12.37 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు 25.26 కోట్ల శాంపిల్స్ పరీక్షించినట్టు వివరించింది.