ఇండియాలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,27,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.
మరోవైపు అదే సమయంలో 2,30,814 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో 1,059 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు.
ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 13,31,648 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 5,01,114కు చేరింది.
అలాగే రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతం కు పెరగగా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 168,98,17,199కు చేరింది.