దేశంలో మరోసారి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,96,692కు చేరాయి. ఇందులో 4,26,99,363 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
ఇప్పటివరకు 5,24,855 మంది మృతిచెందారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 72,474కు చేరాయి. కాగా.. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 15 మంది మహమ్మారికి బలవగా.. 8,518 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
ఇక మొత్తం కేసుల్లో 0.17 శాతం కేసులు యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.62 శాతం ఉండగా.. మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది.
ఇప్పటివరకు 1,96,14,88,807 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.