ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి విపరీతంగా ఉంది. ప్రతి రోజు వేళల్లో కొత్త గా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.కొత్తగా నమోదు అయిన కేసుల్లో విశాఖ 1,959, చిత్తూరు 1,566, అనంతపురం 1,379, గుంటూరులో 1,212 ప్రకాశంలో 1,001 కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు ఇదే సమయంలో 3,913 మంది కరోనా నుంచి కోలుకున్నారు.అలాగే ఆరుగురు మృతి చెందారు.
మొత్తం మరణాల సంఖ్య – 14,538
పాజిటివ్ కేసుల సంఖ్య -21,66,194
డిశ్చార్జ్ కేసుల సంఖ్య – 20,78,513
యాక్టివ్ కేసుల సంఖ్య -73,143