అసోంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో గత రెండు రోజుల్లో విషపూరిత పుట్టగొడుగులు తిని 13 మంది మరణించారు. అసోం మెడికల్ కాలేజీ, ఆస్పత్రి డాక్టర్ ప్రశాంత డిహింగియా ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ఎగువ జిల్లాలైన చరైడియో, దిబ్రూఘర్, శివసాగర్, తీన్సుకియా ప్రాంతాల్లో విషపూరిత పుట్టగొడుగులు తిని 35 మంది అస్వస్తతకు గురయ్యారు. వీరందరిని చికిత్స నిమిత్తం అసోం వైద్య కళాశాల, ఆస్పత్రి (ఏఎంసీహెచ్)లో చేర్చారు’ అని తెలిపారు.
చికిత్స పొందుతూ వీరిలో సోమవారం నలుగురు మరణించినట్టు ఆయన చెప్పారు. మంగళవారం మరో తొమ్మిది మంది మృతి చెందారని తెలిపారు. మొత్తంగా రెండు రోజుల్లో 13 మంది మరణించినట్టు వివరించారు.
బాధితులు అడవిలో దొరికిన పుట్టగొడుగులను తినదగినవిగా భావించి వాటిని తిన్నారు. దీంతో వారంత అస్వస్తతకు గురయ్యారని చెప్పారు. మృతుల్లో చరైడియా జిల్లాకు చెందిన చిన్నారితో పాటు దిబ్రూఘర్ జిల్లాకు చెందిన ఐదుగురు, శివసాగర్ జిల్లాలకు చెందిన వ్యక్తి ఒకరున్నారు.