రంగారెడ్డి జిల్లా పరిధిలోని 13 ల్యాండ్ పార్సెల్ విక్రయానికి వీలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) బుధవారం బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్లో ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం విజయవంతం అయింది.
దాదాపు 100 మంది ఔత్సాహికులు, పలు రియాల్టీ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా ప్రాంతాల ల్యాండ్ పార్సిల్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు వారి సందేహాలు, అనుమానాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
ఈ ఫ్రీ బిడ్ సమావేశానికి హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ (ఈవో) గంగాధర్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీవో) గంగాధర్, రంగారెడ్డి జిల్లా ఆర్డీవో చంద్రకళతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎమ్ఎస్టీపీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హెచ్ఎండీఎస్ సెక్రటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్ లు ల్యాండ్ పార్సెల్ ఉన్న ప్రాంతాలు వాటి ప్రాధాన్యత అంశాలను వివరించారు.
ల్యాండ్ పార్సెల్ కొనుగోలుకు జనవరి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 17వ తేదీన ధరావతు చెల్లించాలని, ధరావతు చెల్లించిన వారు ఈనెల 18వ తేదీ శుక్రవారం రోజున జరిగే ఈ వేలం ప్రక్రియలో పాల్గొని అవకాశం ఉంటుందని తెలిపారు.