హైదరాబాద్ మియాపూర్ లో అదృశ్యమైన 13 నెలల చిన్నారి ఘటన విషాదాంతంగా ముగిసింది. ఇంటికి దగ్గరలోని ఓ గుంతలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఆదివారం ఉదయం చిన్నారిని తల్లిదండ్రులు పక్కింట్లో వదిలిపెట్టి పనులకు వెళ్లిపోయారు. అయితే ఇంటికి తిరిగొచ్చేసరికి పాప జాడలేదు. దీంతో పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు పేరెంట్స్. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరిపారు.
బాలికను 13 ఏళ్ల బాలుడు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. చివరకు చిన్నారి గుంతలో శవమై కనిపించింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? ఎవరైనా హత్య చేశారా..? అనే కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.