ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రతి రోజు కొత్తగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అధికారులు సైతం కరోనా కట్టడి చేసేందుకు రక రకాల చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు.
ముఖ్యంగా విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు జిల్లాలలో కేసులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,516 మందికి పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
విశాఖ పట్నం లో 2,244 పాజిటివ్ కేసులు రాగా చిత్తూరు లో 1,585, అనంతపురం జిల్లాలో 1,235 శ్రీకాకుళంలో 1,230 కేసులు, గుంటూరులో 1,054 కేసులు, నెల్లూరు లో 1,051 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 14,532 మంది మృతి చెందారు.