ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రస్తుతం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా మంగళవారం ఈ సినిమాకు సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళు ఇంటెలిజెంట్ అని…ప్రదీప్ ఆ విషయంలో బెస్ట్ అని అన్నారు.
అయితే స్టార్ హీరోలు ఇంటిలిజెంట్ గా ఉంటారని, వెండితెర కు మెగాస్టార్ చిరంజీవి బుల్లితెర ప్రదీప్ అని కార్తికేయ చెప్పుకొచ్చాడు. అయితే కార్తికేయ చెప్పింది నిజమే అయినప్పటికీ చిరంజీవి తో పోల్చటం పట్ల కొంత మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.