ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడిలో తొలి రోజు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఉక్రెయిన్ సైనికులు, పౌరులు కలిపి మొత్తం 137 మంది మరణించినట్టు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.
‘ ఈ రోజు మనం 137 మంది పౌరులు, సైనికులను కోల్పోయాము. దాడుల్లో 317 మంది తీవ్రంగా గాయపడ్డారు” అని జెలెన్ స్కీ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో ప్రసంగాన్ని విడుదల చేశారు.
‘ మాతో కలిసి పోరాడేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు?. నాకు ఎవరూ కనిపించడం లేదు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వ హామీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అందరూ భయపడుతున్నారు” అని పేర్కొన్నారు.
రష్యా విధ్వంసక గ్రూపులు రాజధాని కీవ్ లోకి చేరుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి, కర్ఫ్యూను పాటించాలని కోరారు.