24 గంటల్లో 13,788 కేసులు.. 14,457 రికవరీలుశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 13,788 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. కరోనాకు చికిత్ప పొందుతూ నిన్న మరో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి తాజాగా 14,457 మంది కోలుకున్నారు.
దేశంలో ఇప్పటివరకు 1,05,71,773 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మొత్తం బాధితుల్లో ఇప్పటికే 1,02,11,342 కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,08,012 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 1,52,419 మంది కరోనాకు బలయ్యారు.