పంజాగుట్ట యువతి కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో డాలర్ బాయ్ అలియాస్ రాజా శ్రీరెడ్డి గురించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో డాలర్ బాయ్‌నే ప్రధానంగా మారడంతో.. అతని కోసం వెతికేపనిలో పడ్డారు సీసీఎస్ పోలీసులు.
ఇప్పటికే డాలర్ బాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఇదే సమయంలో డాలర్ బాయ్ ఆఫీసులో కొంత మంది అమ్మాయిల సర్టిఫికెట్లను గుర్తించిన పోలీసులు…అక్కడికి అవి ఎలా వచ్చాయనే కోణలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సర్టిఫికెట్‌లో ఉన్న అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు డాలర్ బాయ్ కార్యాలయంలో పలు ఆడియో వీడియో టేపులను కూడా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై పలు జిల్లాలో కేసులు నమోదైనట్టు తెలియడంతో… ఆ వివరాలను సేకరిస్తున్నారు. గతంలో డాలర్‌బాయ్‌పై స్వయంగా అతని భార్యే ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో పంజాగుట్ట యువతి కేసును అడ్డుపెట్టుకొని.. రాజ శ్రీ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ కుట్ర చేస్తున్నాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.