ఏపీలో కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 60,350 శాంపిల్స్ పరీక్షించగా…1,393 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 08 మంది కరోనా బాధితులు మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 1,296 మంది కరోనా బాధితులు కొలుకున్నారు.
తాజా గణాంకాల ప్రకారం నమోదు అయిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179 కు చేరగా.. 20,07,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు కరోనా తో మృతిచెందినవారి సంఖ్య 14,797 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి.