ఎన్నో ఆశలతో జీవితం మొదలు పెట్టి, ఎన్నో ఆశలతో రంగుల ప్రపంచంలో అడుగు పెట్టిన ఎందరో నటులు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. తమ నటన తో చిన్న వయసులోనే ఏదోక పాత్ర తో మన ముందు అలా మెరిసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినా 14 మంది నటులను చూస్తే…
Also Read:ప్రతిపక్ష కూటమిలోకి నితీశ్ ఎంట్రీ లేనట్టేనా…
సావిత్రి
45 ఏళ్ళు బ్రతికిన మహానటి… అనారోగ్యంతో ఆస్పత్రిలో జాయిన్ అయి కోమాలోకి వెళ్ళారు. ఏడాది పాటు కోమాలో ఉన్నారు. ఎన్నో అలవాట్లకు ఆమె వ్యక్తిగత జీవితం కారణంగా బానిస అయ్యారు.
కునాల్
ప్రేమికుల రోజు సినిమాతో అందరికి దగ్గరైన ఈ హీరో… సరిగా 30 ఏళ్ళు బ్రతికాడు. ఆర్ధిక సమస్యలు, వ్యక్తిగత జీవితంలోని సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భార్గవి
అష్టా చెమ్మా సినిమాలో నానీకి చెల్లిగా నటించిన భార్గవి ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదు అనే కారణంతో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విజయ్ సాయి
అమ్మాయిలూ అబ్బాయిలు, ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన విజయ్ సాయి సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
యశో సాగర్
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ఈ నటుడు 2012 లో సినిమా షూటింగ్ కు వెళ్తూ చనిపోయాడు.
సౌందర్య
తెలుగు వారి ఇంట్లో ఆడపిల్లగా భావించే సౌందర్య ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల ప్రచారం చేసే క్రమంలో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ప్రత్యూష
శ్రీ రాములయ్య, స్నేహం అంటే ఇదేరా సినిమాల్లో నటించిన ఈ నటి… వ్యక్తిగత విషయాలతో ఆత్మహత్య చేసుకున్నారు. కాని ఆమె తల్లి మాత్రం హత్య అంటారు.
ఉదయ్ కిరణ్
తెలుగు వారు ఎప్పటికీ మరువులేని హీరోల్లో ఇతను కూడా ఒకడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సినిమాలు చేసి ఆ తర్వాత ఆర్దిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. 33 ఏళ్ళకు తనువు చాలించాడు.
జియా ఖాన్
ఎన్నో హిందీ సినిమాల్లో మంచి పాత్రలు చేసిన నటి జియా ఖాన్ బాయ్ ఫ్రెండ్ తో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.
సుశాంత్ సింగ్
34 ఏళ్ళ వయసు లో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుని సిబిఐ విచారిస్తుంది.
దివ్య భారతీ
చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చి మంచి పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని 19 ఏళ్ళ వయసులో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయారు.
సిల్క్ స్మిత
ఈ పేరు వింటే ఇండియన్ సినిమా ఇప్పటికీ ఊగిపోతుంది. స్పెషల్ సాంగ్ అంటే చాలు సిల్క్ ఉండాల్సిందే అన్నట్టు ఉండేది. ఎందరో స్టార్ హీరోలు ఆమెతో డాన్స్ కూడా చేయలేకపోయారు. మేకప్ ఆర్టిస్ట్ గా వచ్చి వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పునీత్ రాజ్ కుమార్
కన్నడ స్టార్ నటుడు పునీత్ గత ఏడాది 46 ఏళ్ళ వయసు లో కన్ను మూసాడు. గుండెపోటు కారణంగా అతను గత ఏడాది విక్రం ఆస్పత్రిలో కన్ను మూసాడు.
ఆర్తి అగర్వాల్
తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ఆర్తి అగర్వాల్. ఆమె చేసిన ఎన్నో పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఒక ఆపరేషన్ చేయించుకుని ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో మరణించారు.
Also Read:చైనాకు తిరిగి ఎప్పుడు వెళతామో.. వైద్య విద్యార్థుల్లో ఆందోళన