హిమాచల్ ప్రదేశ్ కొండచరియల ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరగా.. 14 మంది గాయపడ్డారు. ఇంకా చాలామంది గల్లంతయ్యారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
రిక్ కాంగ్ పియో – సిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ దగ్గర జరిగిందీ ఘటన. ఓ బస్సు, ట్రక్కు సహా పలు వాహనాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ కి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఏ సాయం అవసరమైనా అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా ప్రమాదకరంగా ఉందని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు విభాగం తెలిపింది. మరోవైపు విరిగిపడుతున్న కొండచరియల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెలలో ఇదే జిల్లాలో జరిగిన ప్రమాదంలో 9 మంది టూరిస్టులు మరణించారు.