ఢిల్లీ జహంగీర్ పురి అల్లర్ల కేసులో ఇప్పటి వరకు 23 మంది నిందితులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్తానా తెలిపారు. ఇందులో ఎనిమిది మందిపై గతంలోనూ పలు కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.
కేసులో మొత్తం 14 పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా కేసులో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ కేసులో ఇరు వర్గాలకు చెందిన నిందితులను అరెస్టు చేశామన్నారు.
అల్లర్లలో ఇప్పటి వరకు 8 మంది పోలీసులు, మరో తొమ్మిది మంది పౌరులు గాయపడినట్టు తెలిపారు. సీపీ టీవీ ఫుటెజ్ లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే మరి కొంత మంది నిందితులను గుర్తించినట్టు పేర్కొన్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేయనున్నట్టు చెప్పారు.
నిందితుల దగ్గర నుంచి మూడు తుపాకులుచ, కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించినట్టు వివరించారు. ఘటనా స్థలంలో ఇప్పటికే సాక్ష్యాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.