తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31,834 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 149 మందికి పాజిటివ్ అని తేలింది. కరోనాకు చికిత్స పొందుతూ నిన్న ఒకరు మృతి చెందారు. ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో 186 మంది కోలుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 2,95,831 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటికే 2,92,415 మంది కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా ఇప్పటిదాకా1,612 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,804 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 81,54,347 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.