దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు 11 వేలకు అటూ, ఇటూగానే పరిమితమైన కేసులు.. ఇప్పుడు 14 వేలకుపైనే బయటపడుతున్నాయి. నిన్నటి కంటే కేసులు సంఖ్య ఇవాళ మరింత పెరిగింది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,264 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,09,91,651కి పెరిగింది. ఇందులో ఇప్పటికే 1,06,89,715 మంది బాధితులు ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. నిన్న కరోనా కారణంగా మరో 90 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు వైరస్ బారినపడి1,56,302 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,45,634 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో 6281, కేరళలో 4650, కర్ణాటకలో 490 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదవలేదని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.