జనాలు తమ ఖరీదైన కార్ల కోసం లేదా ఖరీదైన బైక్స్ కోసం గాను ఫ్యాన్సీ నెంబర్ లు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి 70 వేల బైక్ కోసం 15 లక్షలు ఖర్చు చేసి ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడు. తమా ఫ్యాన్సీ నంబర్‌లు ఇతర డ్రైవర్‌లను భయపెట్టడానికి మినహా ఎందుకు ఉపయోగపడే అవకాశం లేదు. చాలా మంది అందరూ సులభంగా గుర్తించే విధంగా నెంబర్ లు తీసుకుంటారు.
Also Read:షాకింగ్: స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడిన గొరిల్లా, తలపట్టుకుంటున్న అధికారులు…!
అదేవిధంగా చండీగఢ్‌లో బ్రిజ్ మోహన్ ఓ వ్యక్తి తన వాహనానికి ఫ్యాన్సీ నంబర్‌ను కొనుగోలు చేశాడు. అయితే అతను వేలంపాటలో పాల్గొనే వారికి షాక్ ఇచ్చాడు. అతని స్కూటీ కోసం ఫ్యాన్సీ నంబర్ CH01- CJ-0001 కోసం 15.44 లక్షలు ఖర్చు చేసాడు. స్కూటీ ధర కేవలం రూ. 71,000 మాత్రమే. అయితే కొన్న తర్వాత అందరికి షాక్ ఇచ్చాడు. ఆ నెంబర్ ను తన కారు కోసం వాడుకుంటా అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
చండీగఢ్ రిజిస్టరింగ్ మరియు లైసెన్సింగ్ అథారిటీ ఏప్రిల్ 14-16 వరకు CH01-CJ సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్‌లు మరియు మిగిలిపోయిన నంబర్‌ల కోసం వేలం నిర్వహించింది. బిడ్డర్లు సిరీస్ కోసం 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసారట. CH-01-CJ-002 రెండవ ఖరీదైన నెంబర్ గా నిలిచింది. ఈ నెంబర్ ను రూ. 5.4 లక్షలకు కొనుగోలు చేసారు.
Also Read:కేసీఆర్ పై రగిలిపోతున్న రైతన్న.. కారణాలు అనేకం..!