విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి తెలియని వారుండరు. ఆయన కొన్ని వందల చిత్రాల్లో నటించారు. అలాగే ఆయన వెయ్యని పాత్ర లేదు. ఒక రాముడు… ఒక కృష్ణుడు… ఒక దుర్యోధనుడు ఇలా ఎవరి పేరు చెప్పినా ఆంధ్రులకు వెంటనే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు. పౌరాణిక పాత్రలో సినిమా అంటే ఎన్టీఆర్ పేరు ఉండాల్సిందే. అయితే ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. అందులో దానవీరశూరకర్ణ సినిమా ఒకటి.
1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా అప్పట్లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమాను స్వయంగా ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. అంతేకాకుండా దర్శకత్వం కూడా వహించారు. అలాగే దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుడు గా మూడు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో ఆయన కుమారుడు అయిన నందమూరి బాలకృష్ణ హరికృష్ణ కూడా నటించారు.
ఆర్ఆర్ఆర్, పుష్ప,భీమ్లానాయక్ కన్నా అఖండ పెద్ద హిట్ … ఎలానో తెలుసా !!
ఇకపోతే ఈ సినిమా అప్పట్లో 20 లక్షల రూపాయలతో తెరకెక్కించారు. అలాగే మూడు సార్లు రిలీజ్ చేశారు. అప్పట్లో పెట్టిన బడ్జెట్ కు పదిహేను రెట్లు ఎక్కువగా లాభాలను తీసుకు వచ్చింది ఈ చిత్రం. అంటే అప్పట్లోనే మూడు కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే నాలుగు గంటల నిడివితో 25 రీల్స్ తో తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారతదేశ సినిమా చరిత్రలోనే పెద్ద సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
టాలీవుడ్ లో 100 కి పైగా సినిమాలు చేసిన ఆ 14 మంది హీరోలు ఎవరో తెలుసా ?
అయితే పెద్ద సినిమాని కూడా ప్రేక్షకులకు విసుగు పుట్టకుండా తెరకెక్కించారు ఎన్టీఆర్. తన నటనతో దర్శకత్వ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ చిత్రం సెకండ్ రిలీజ్ లో కూడా 100 రోజులు ఆడింది. అదే సమయంలో కృష్ణ హీరోగా కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన కురుక్షేత్రం కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అర్జునుడిగా కృష్ణ కృష్ణుడిగా శోభన్ బాబు, కర్ణుడిగా కృష్ణంరాజు నటించారు. అయితే దాన వీర శూర కర్ణ సినిమా ముందు కురుక్షేత్రం నిలబడలేకపోయింది.