యూపీలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో భదాహీలో ఓ బాలికను కాల్చి చంపాడో ఉన్మాది. నడి రోడ్డుపై బాలిక సోదరి చూస్తుండగానే ఆమెపై కాల్పులు జరిపాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ క్రమంలో ఆమెను చంపాలని అనుకున్నాడు. ఇనిస్టిట్యూట్ నుంచి తన సోదరితో కలిసి ఇంటికి వెళ్తున్న అనురాధను అరవింద్ దారిలో అడ్డగించాడు. వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీతో అనురాధపైకి కాల్పులు జరిపాడు. ఆమె సోదరి చూస్తుండగానే అనురాధను తుపాకితో కాల్చాడు.
దీంతో అనురాధ అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అరవింద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అరవింద్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.