ఆడు మగాడ్రా..ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు… వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు.. గులాబీ మొక్కకి అంటు గడుతున్నట్టు.. చాలా జాగర్తగా పద్ధతిగా కొట్టాడ్రా..ఆడు మగాడ్రా బుజ్జా.. ఈ డైలాగ్ వినగానే అర్ధం అయిపోయే ఉంటుంది. ఇది ఏ సినిమానో.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అతడు.
ఈ సినిమాలో మహేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. బ్రహ్మానందం కామెడీ టైమింగ్, మహేష్ యాక్షన్ సినిమా విజయానికి కారణమనే చెప్పాలి. ఇక సినిమాలో గన్ చూడాలనుకో పర్లేదు.. బుల్లెట్ చూడాలనుకోకు పోతావ్ అంటూ త్రివిక్రమ్ డైలాగ్స్ సూపర్ గా పేలాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా!!సరిగ్గా ఈ రోజుతో అతడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 15 ఏళ్ళు అవుతుంది.
ఆడు మగాడ్రా..
ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు… వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు.. గులాబీ మొక్కకి అంటు గడుతున్నట్టు.. చాలా జాగర్తగా పద్ధతిగా కొట్టాడ్రా
ఆడు మగాడ్రా బుజ్జా..#15YearsforClassicAthaduSuperstar @urstrulyMahesh #Trivikram pic.twitter.com/PjS4C5Rl7u
— BARaju (@baraju_SuperHit) August 10, 2020