ఏపీలో కరోనా కేసుల సంఖ్య నిన్నటి తో పోలిస్తే మరిన్ని తగ్గాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో 27,522 మందికి టెస్ట్ లు చేయగా 1,679 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక తాజాగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 350, కృష్ణాలో 225, గుంటూరు లో 212 కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు గడిచిన 24 గంటల్లో 9,598 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ఇద్దరు మరణించారు.
పాజిటివ్ కేసుల సంఖ్య – 23,08,622
డిశ్చార్జ్ కేసుల సంఖ్య – 22,47,824
యాక్టివ్ కేసుల సంఖ్య – 46,119
మొత్తం మరణాల సంఖ్య – 14,679