ఓవైపు ఉల్లి ధరలు మండిపోతుండటంతో… జనం ఉల్లి కొనటమే మానేశారు. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిధర 200 దాటడంతో ఉల్లి పేరు వింటేనే కన్నీరు వస్తోంది. ఇక వీటికి తోడు ఉల్లిపై వస్తున్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు.
అయితే… బంగారం, వెండి ఎత్తుకెళ్లిన దొంగలను చూసి ఉంటాం కానీ, ఇప్పుడు ఉల్లి దొంగలను కూడా చూడాల్సి వస్తుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. ఉల్లి దొంగలు కూడా తయారయ్యారు. దాదాపు రెండు క్వింటాళ్ల ఉల్లిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు అందటం… ఉల్లి కొరత తీవ్రతను తెలియజేస్తుంది.
ముంబైలోని డోంగ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 5న ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఈ ఉల్లి దొంగతనాలు నమోదు అవుతూనే ఉన్నాయి.