దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా… ఏపీలో కాస్త తక్కువగానే ఉన్నాయి అనుకుంటున్న దశలో కరోనా వైరస్ ఏపీలోనూ పంజా విసిరింది. ఒకే రోజు ఏకంగా 17 కేసులు నమోదు కావటంతో ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది.
కొత్తగా వచ్చిన 17 కేసుల్లో… అనంతపురంకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో 10ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరిద్దరు మక్కాకు వెళ్లివచ్చిన కర్ణాటక ప్రాంతం వారితో సన్నిహితంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రకాశం జిల్లాలకు చెందిన వారు ఇద్దరు ఉండగా…ఇందులో ఒకరు ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరు కాగా మరోకరు కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితం ఉన్నారు.
గుంటూరుకు చెందిన కేసుల్లోనూ ఒకరు ఢిల్లీ మత ప్రార్థనలకు హజరుకాగా, మిగిలిన వారు కరోనా వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నారు. ప్రకాశం జిల్లా కేసులన్నీ ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే.
కొత్తగా బయటపడ్డ 17 కేసుల్లో 11 కేసులు ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన వారు ఉండగా… ఇప్పటికే పాజిటివ్ అయిన కేసుల్లోనూ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఇంకా ఎవరెవరు వెళ్లారు, వారితో సన్నిహితంగా ఉన్నారు అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తుంది.