ఇండియాలో కరోనా కేసులు గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,72,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు అదే సమయంలో కరోనా నుంచి 2,59,107 మంది పూర్తిగా కోలుకున్నారు.
అలాగే గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 1,008 మంది మృతి చెందారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో కేరళలో 52,199, కర్ణాటకలో 20,505, మహారాష్ట్రలో 18,067, తమిళనాడులో 14,013, గుజరాత్‌లో 8,934 కేసులు నమోదు అయ్యాయి.
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉండగా దేశంలో 167.87 కోట్ల మంది వాక్సిన్ వేసుకున్నారు.
మొత్తం యాక్టివ్ కేసులు 15,33,921
మొత్తం మరణాల సంఖ్య 4,98,983