ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చలాన్లు ఎలా వేయాలా అని పోలీసులు చూస్తారు. వేసిన చలాన్లు కట్టకుండా ఎలా తప్పించుకోవాలా అని కొందరు ఆలోచిస్తారు. అయితే నగరంలో ఓ సంఘటన జరిగింది. అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసిన ఓ వాహన దారుడు బైక్ ను రోడ్డుపైనే వదిలి పరుగులు తీసాడు. ఇది గమనించిన పోలీసులు కంగారుగా బైక్ వద్దకు వెళ్లి చూసారు. అక్కడ ఏం లేదు. ఎందుకు పరుగులు పెట్టాడో అర్థం కాలేదు.
Also Read: ఇంట్లో పాములు.. యజమాని ఏం చేశాడంటే?
సీన్ కట్ చేస్తే.. కండ్లు బైర్లు కమ్మే విషయం బయట పడింది. ఆ బైక్ పైన ఏకంగా 179 చలాన్లు ఉన్నాయి. మొత్తం రూ.42,475 పెండింగ్. దీంతో షాకైన పోలీసులు బైక్ ను సీజ్ చేసి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.