టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం 18 పేజెస్. అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్టులుక్ ను అలాగే మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో నందిని పాత్రలో అనుపమ కనిపించనుంది.
ఇక బన్నీవాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించారు.